దిశ, మల్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న రేషన్ బియ్యం మీదే చాలా పేద కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే, పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో ముక్కపట్టిన బియ్యం, పురుగులు ఉన్న బియ్యం రావడంతో లబ్దిదారులు ఆందోళన చేపట్టిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల 36వ నెంబర్ రేషన్ షాప్‌లో మార్చ్ నెల కోటా కింద సరఫరా చేస్తున్న బియ్యంలో పురుగులు ఉండటం, ముక్కపట్టి ఉన్న బియ్యాన్నే సరఫరా చేయడం పట్ల స్థానికులు రేషన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు. స్పందించిన అధికారులు ముక్కిపోయిన బియ్యం వాపసు తీసుకుని మళ్లీ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.