గోదావరిఖనిలో కొనసాగుతున్న హాత్ సే హత్ జోడో యాత్ర
రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడోయాత్ర 5వ రోజుకు చేరుకుంది. శుక్రవారం కార్పోరేషన్ పరిధిలో చేపట్టిన పాదయాత్రలో భాగంగా 29 , 8 వ
దిశ, గోదావరి ఖని: రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడోయాత్ర 5వ రోజుకు చేరుకుంది. శుక్రవారం కార్పోరేషన్ పరిధిలో చేపట్టిన పాదయాత్రలో భాగంగా 29 , 8 వ డివిజన్లో విజయవంతంగా ప్రతి ఇంటికి ,ప్రతి గడపకు నాయకులు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మక్కాన్సింగ్ మాట్లాడుతూ.. ఓ సి 5 బ్లాస్టింగ్ ల వల్ల ధూళి, కాలుష్యంతో నగర వాసులు గుండె, కిడ్నీ లాంటి ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్నారన్నారు. ప్రశ్నించే వారిని బిఆర్ఎస్ పార్టీ వాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నరన్నరు. దోపిడి తప్ప అభివృద్ధి లేదని ఆరోపించారు.
ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘ నాయకులు మనాలి ఠాకూర్ , సీనియర్ నాయకులు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ , ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి , మారెల్లి రాజి రెడ్డి, కార్పొరేటర్లు గాధం విజయనంద్ , ముస్తఫా,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాజా నాజీమొద్దీన్ ,మాటూరు సత్య ప్రసాద్ చొప్పదండి ,దుర్గాప్రసాద్, తాళ్లపల్లి యుగంధర్, మేకల పోశం, గట్ల రమేష్ , ఉమ్మేతుల దేవేందర్ రెడ్డి ,మల్ రెడ్డి , ఆషిప్ పాషా ,సీనియర్ నాయకులతో పాటు యువ నాయకులు నాజిమ్, కౌటాం సతీష్, కళ్యాణ్,సోషల్ మీడియా కోర్డినేటర్ సతీష్, దూళికట్ట గాదె సుధాకర్ , నంది వెంకటేష్, బర్పటి శ్రీనివాస్, సింగం కిరణ్, రాయ మల్లు యాదవ్, గజ్జల నాగరాజ్ , ప్రధాన మహిళా నాయకులతో పాటు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.