వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత... భారీగా పోలీసుల మోహరింపు..
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల
దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గత మంగళవారమే ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్ అధికారులు స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే. ఎండోమెంట్ లో కలపవద్దని గ్రామస్తులు గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే నేడు మంగళవారం కావున దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో రానుండగా ఎండోమెంట్ ఏవో కాంత రెడ్డి తన విధుల్లో భాగంగా నేడు ఎల్లమ్మ ఆలయం వద్దకు వచ్చారు. అయితే గ్రామస్తులు భారీ సంఖ్యలో ఏవో ను అడ్డుకునే ప్రయత్నం చేసి మేము దేవస్థానం ఆధీనంలో ఉన్న ఎల్లమ్మ ఆలయాన్ని తిరిగి గ్రామస్తుల ఆధ్వర్యంలో నడిపించేందుకు ఆర్డర్ తీసుకొస్తామని అప్పటి వరకు దేవాదాయ శాఖ రావద్దోని ఏవో కాంతరెడ్డి ని కోరారు. దానికి కాంత రెడ్ది మాట్లాడుతూ...మీరు సరైన ఆర్డర్ తో రావాలని మా పనులకు ఆటంకం కలిగించొద్దని గ్రామస్తులతో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సీఐ నిరంజన్ రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బందోబస్తు నిర్వహించారు.