మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హౌస్ అరెస్ట్..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.పదిహేను వేలు
దిశ,గంగాధర: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.పదిహేను వేలు ఇస్తామని చెప్పింది. కానీ నిన్న జరిగిన కేబినెట్ లో దాన్ని కుదించి రూ. 12 వేల మాత్రమే రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆదివారం రోజున మధుర నగర్ చౌరస్తాలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైతులతో కలిసి రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ధర్నాకు పిలుపునిచ్చారు.దీంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను ఉదయం అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.