అట్టుడుకుతున్న Metpally... ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ భారీగా నినాదాలు

మెట్‌పల్లి మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన జగ్గసాగర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని...Tension at metpalli

Update: 2022-12-08 09:55 GMT

దిశ, మెట్ పల్లి: మెట్‌పల్లి మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన జగ్గసాగర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ జగ్గసాగర్ పరిసర గ్రామాల ప్రజలు మెట్ పల్లిలోని పాత బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నా జగ్గసాగర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గత వంద రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేసినా స్థానిక ప్రజాప్రతినిధుల స్పందన లేదని, జగిత్యాలలో బుధవారం జరిగిన సీఎం సభలో జగ్గాసాగర్ గ్రామం ప్రస్తావనే తీయలేదంటూ జగ్గాసాగర్ గ్రామన్ని మండలంగా ప్రకటించాలని, లేదంటే పరిసర గ్రామాలతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్తేనే ధర్నా విరమిస్తామని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సత్యనారాయణ ధర్నా వద్దకు చేరుకుని సమస్యను పై అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పడంతో ధర్నా విరమింపజేయాలని పోలీసులను ఆదేశించటంతో ఇంచార్జ్ సీఐ రాజ శేఖర్, మెట్ పల్లి ఎస్ఐ సదకర్, సిబ్బంది అక్కడికి చేరుకుని ధర్నాను విరమింపజేశారు. 

Tags:    

Similar News