గొర్రెల మందపై వీధి కుక్కల దాడి.. 22 గొర్రెలు మృతి

వీధి కుక్కల దాడిలో పెద్ద సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

Update: 2025-03-17 14:38 GMT
గొర్రెల మందపై వీధి కుక్కల దాడి.. 22 గొర్రెలు మృతి
  • whatsapp icon

దిశ, మెట్ పల్లి : వీధి కుక్కల దాడిలో పెద్ద సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మెట్పల్లి మండలం వేంపేట్ గ్రామంలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపేట్​ గ్రామానికి చెందిన రాచర్ల అంజయ్య అనే వ్యక్తికి చెందిన పశువుల కొట్టంలో సోమవారం గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాంతో 22 గొర్రెలు చనిపోయాయి. మరో ఆరు గొర్రెలకు గాయాలన్నాయి.

    బాధితుడు రాచర్ల అంజయ్య మాట్లాడుతూ సుమారు రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉపాధి కోల్పోయిన బాధితుడిని ప్రభుత్వం తరుపున ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తానని బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు అల్లూరి మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న పశు వైద్య అధికారి డా.మనిషా తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వీరి వెంట రైతులు బద్దం స్వామి, రాములు తదితరులు ఉన్నారు. 


Similar News