ఇసుక తవ్వకాలు ఆపండి..
వీణవంక మండల పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని రైతులు, గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
దిశ, వీణవంక: వీణవంక మండల పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని రైతులు, గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇటీవల చల్లూరు, మల్లారెడ్డిపల్లి, ఇప్పలపల్లి, కోర్కల్ గ్రామాల్లో ఇసుక రీచులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా స్థానిక రైతులు, గ్రామస్తులు ఇసుక తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిమితికి మించి తవ్వకాలు చేపడితే భూగర్భ జలాలు అడుగంటి పోతాయని, పంటలకు భవిష్యత్తులో నీరు దొరకడం కష్టమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పలపల్లి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇసుక కాంట్రాక్టర్ కుమ్మక్కై అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతున్నారని అన్ని అనుమతులు ఉంటే అర్ధరాత్రి పనులు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.