'MLA Rasamayi Balakishan కనబడుటలేదు..'

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం‌లోని తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డి కాలనీ నుండి మొదలైన ప్రజా ప్రస్థానం పాదయాత్ర‌లో భాగంగా

Update: 2022-11-16 13:58 GMT

దిశ,తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం‌లోని తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డి కాలనీ నుండి మొదలైన ప్రజా ప్రస్థానం పాదయాత్ర‌లో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రసమయి బాలకిషన్ కనిపించడంలేదంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది. గోసి గొంగడితోని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దొరల చెంతన చేరిన రసమయి నియోజకవర్గంలో మిల్లర్ల దగ్గర నుండి మొదలుకొని ప్రతి పనిలో కమిషన్లు తీసుకుంటూ వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఉద్యమకారుడు కదా అని సంస్కృతిక విభాగానికి అధ్యక్షున్ని చేస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు.550 ఉద్యోగాలు కావాలని అడిగితే నిరుద్యోగులకు ఇచ్చారా అని ప్రశ్నించారు. లక్ష రూపాయలు అకౌంట్ లో లేని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి ఈరోజు ఫామ్ హౌజులు, వందల ఎకరాల భూములు ఎక్కడికెళ్లి వచ్చాయని అన్నారు.

అలాగే ఈరోజు కేసీఆర్ మాయమాటలను తెలంగాణ ప్రజలు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. అధికారంలోకి రాకముందు ఒకమాట వచ్చాక పరిపాలన మరచి ఫామ్ హౌస్‌లో ఉంటూ పరిపాలన అటకెక్కించారని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు విని ప్రజలు విసిగెత్తిపోయారని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.

Tags:    

Similar News