పాఠశాల అటెండర్‌ను విధుల నుంచి తొలగింపు.. ఆ పని చేస్తూ ఫోటోలకు ఫోజులు..
చందుర్తి మండలంలో నర్సింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో

దిశ,చందుర్తి : చందుర్తి మండలంలో నర్సింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో సర్వీస్ పర్సన్ అటెండర్ గా పని చేస్తున్న బండి రాకేష్ ను విధుల నుంచి తొలగించినట్టు చందుర్తి మండల విద్యాధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అటెండర్ రాకేష్ పాఠశాలలో ఎవరూ లేని సమయంలో పదో తరగతి విద్యార్థులతో కలిసి మద్యం సేవిస్తూ విద్యార్థులను దురలవాట్లకు పురిగొల్పుతున్న విషయం జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రావు దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు అటెండర్ రాకేష్ ను విధుల నుంచి తొలగించినట్లు మండల విద్యాధికారి తెలిపారు. అటెండర్, స్టూడెంట్ లు కలిసి మద్యం సేవిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టూడెంట్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.