క్రీడా ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన సర్పంచ్..
క్రీడా ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన ఘటన కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయపల్లిలో చోటుచేసుకుంది.
దిశ, కొడిమ్యాల : క్రీడా ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన ఘటన కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మాయపల్లిలో చోటుచేసుకుంది. డబ్బుతిమ్మయ్యపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ క్రీడాప్రాంగణంను గత 45రోజుల క్రితమే కలెక్టర్, ఎమ్మార్వో చూపించిన స్థలంలో నిర్మించారు. కానీ ఆ క్రీడా ప్రాంగణంను నాచూపల్లి గ్రామ సర్పంచ్, గ్రామస్థులు కొంతమంది వచ్చి దౌర్జన్యంగా క్రీడా ప్రాంగణంను జేసీబీతో ధ్వంసం చేశారని డబ్బు తిమ్మయ్య పల్లె సర్పంచ్ ఆరోపిస్తున్నారు. దాదాపు 20వేల రూపాయల విలువగల క్రీడాప్రాంగణం సామగ్రిని దొంగతనానికి గురి అయ్యిందని ఆయన తెలిపారు. విషయాన్నీ డబ్బుతిమ్మయ్యపల్లి సర్పంచ్ నాచుపల్లి సర్పంచ్ కు ఫోన్ చేసి ఎందుకు ఇలా చేశారు అని అడగగా, మా శివారులో ఎందుకు క్రీడాప్రంగణం నిర్మించారు.
అందుకే ఇలా చేసాము అని దురుసుగా మాట్లాడడం జరిగిందని డబ్బు తిమ్మాయపల్లి సర్పంచ్ తెలిపారు. అందుకుగాను గురువారం రోజున డబ్బు తిమ్మయ్య పల్లి గ్రామస్థులము అందరము దాదాపు 150 మంది ఈ రోజు మండల మెజిస్ట్రేట్ ఎమ్మార్వోను కలిసి ఘటన పై వీలైనంత త్వరగా తగు చర్య తీసుకోవాలని వినతి పత్రం అందించారు. అనంతరం స్థానిక ఎస్సైకి ఘటన పై పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డబ్బు తిమ్మయ్య పల్లి గ్రామ సర్పంచ్ డబ్బు రాధగౌతంరెడ్డి, ఉపసర్పంచ్ సూరకంటి ముత్యంరెడ్డి, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, వార్డ్ సభ్యులు, ఎండీ అక్బర్, బొటుకు శ్రీను, శ్రీరాముల అనిల్, కొప్షన్ లచ్చిరెడ్డి, కులసంఘాల పెద్దమనుషులు, వెల్మ రాజిరెడ్డి, సుర్కంటి రాజిరెడ్డి, బద్దం సత్యంరెడ్డి, డబ్బు కాశీరాంరెడ్డి, డబ్బు వెంకట్ రెడ్డి, గడ్డం గంగయ్య, అదరవేని గంగయ్య, గండి రవి, గాజుల లింగయ్య, కనకయ్య గోల్కొండ రాజు, బండపెల్లి రాజేశ్వరి, బత్తుల రాజు, దేవయ్య, ఒడ్నాల అంజయ్య, శంకర్, జంగిడి మహిపాల్, పబ్బ రాములు, గ్రామస్థులు తదితరుల పాల్గోన్నారు.