వాగులను తోడేస్తున్న ఇసుకాసురులు

యథేచ్ఛగా ఇసుక అక్రమార్కులు, వాగులలోని ఇసుకను తోడేస్తూ సొమ్ము చేసుకుంటూ, ప్రభుత్వ సంపదకు... Sand Mafia

Update: 2023-02-25 13:17 GMT

దిశ, కోనరావుపేట: యథేచ్ఛగా ఇసుక అక్రమార్కులు, వాగులలోని ఇసుకను తోడేస్తూ సొమ్ము చేసుకుంటూ, ప్రభుత్వ సంపదకు గండి కొడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో రోజు రోజుకు ఇసుక ఆక్రమణ రవాణా జోరుగా సాగుతున్నది. గ్రామాల్లోని వాగులలో గల సహజ సంపదను అక్రమంగా తోడేసుకుని సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వనికి మస్కా కొట్టి పక్కదారి పట్టిస్తున్నా కానీ, అధికారులు పట్టించుకోవడంలేదు. మండల కేంద్రానికి చెందిన సుద్దాల, కనగర్తి, మామిడిపల్లి, బావుసాయిపేట, వెంకట్రావుపేట, కొండాపూర్ నిమ్మపల్లి, వట్టిమల్ల గ్రామాల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతున్నా అధికారులు సైతం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ములవాగు పరిసర ప్రాంతాల నుండి అక్రమకారులు భారీగా ఇసుకను రవాణాన చేస్తూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ దొరికిన కాడికి దండుకుంటున్నారు అని పలు ఆరోపణలు ఉన్నాయి. రోజూ రాత్రి సమయంలో ఇసుకను గుట్టు చప్పుడు కాకుండా తరలించడమే కాక, ప్రభుత్వం పర్మిషన్ పేరుతో అక్రమార్కులు డే టైమ్ లో కూడా, ప్రభుత్వ సంబధిత అభివృద్ధి పనులపైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు తదితర ప్రభుత్వ పనులకు అని మూలవాగు నుండి ఇసుకను తీసుకెళ్ళేందుకు ప్రభుత్వం కల్పించిన వెసులు బాటును కొందరు దుర్వినియోగం చేస్తూ ఇసుకను, ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.


పలుమార్లు పిర్యాధులు చేసినా ఫలితం శూన్యం

అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లపై ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమే అని చెప్పాలి. అక్రమ ఇసుక ట్రాక్టర్లను కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. మండల కేంద్రంలోని ములవాగుకు అనుకుని ఉన్న గ్రామాల్లో నుండి ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా ఇసుకను తరలించడం, వాటికి అధికార పార్టీ నాయకులే అండదండలు ఉండటంతో రెచ్చిపోతున్న ఇసుకాసురులకు మండల అధికారులు సైతం చూసి చూడనట్టుగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ, పోలీసు యంత్రాంగం నిఘా కూడా కొరవడింది అనే పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాప్పటికీ, కొన్ని చోట్ల అధికారులే అందినకాడికి చేతులు తడుపుకుని వదిలేస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా చూసినవారు అడ్డుకుని ఆపే ప్రయత్నం చేసినవారిపై బల ప్రయోగానికి కూడా అక్రమార్కులు వెనుకాడటంలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నా తీరుపై అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో దొరికిన కాడికి దండుకుంటున్నా ఇసుకాసురులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నవారిపై ఉక్కు పాదం మోపి వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి సహజ సంపదను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News