అతిధి అధ్యాపకుల వేతన బకాయిలు చెల్లించాలి: పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జిల్లాలోని వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న అతిధి అధ్యాపకులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ను కోరారు.

Update: 2023-04-25 09:50 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: జిల్లాలోని వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న అతిధి అధ్యాపకులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ను కోరారు. గత ఆరు నెలల నుంచి పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి వేతనాలు చెల్లించేలా కృషి చేయాలని అతిధి అధ్యాపకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు.

స్పందించిన ఎమ్మెల్సీ కళాశాల విద్యా కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి అతిధి అధ్యాపకుల సమస్యలను వివరించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా అతిధి అధ్యాపకులు విద్యార్థులకు బోధన అందిస్తున్న వారికి చెల్లించే వేతనాలు విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు.

ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకుండా ఉండటం వల్ల వారు దుర్బర జీవితం గడుపుతున్నారని బోధన వృత్తి పైననే ఆధారపడి జీవిస్తున్న అతిధి అధ్యాపకులు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే వాళ్లు బతికేదెట్లా అంటూ ప్రశ్నించారు. అతిధి అధ్యాపకులకు కూడా నిర్ణయించిన వేతనం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి వారికి బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జిల్లా అతిధి అధ్యాపకుల సంఘం నాయకులు ఈ. రమేష్, ఎం. ప్రవీణ్ కుమార్, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News