సిరిసిల్లలో ఘనంగా RSP బర్త్ డే వేడుకలు..
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ ఆధ్వర్యంల సిరిసిల్ల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి అంకని బాను, జిల్లా ఇంచార్జ్ మ్యాకల మునీంధర్ హాజరయ్యారు. అంకుని భాను మాట్లాడుతూ.. బహజనుల రాజ్యాధికామే లక్ష్యంగా పోరాడుతామని.. రాబోయే సెస్ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్లో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గంలో విజయఢంకా మోగించి ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకొని.. వచ్చే ఏడాది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం గిఫ్ట్‌గా ఇస్తామన్నారు. అదే విధంగా ప్రతీ గ్రామానికి వెళ్లి బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కొరకు పోరాటం చేస్తూ.. అది సాధించే వరకు నిద్రపోమని తెలిపారు. బీఎస్పీ నాయకులు, నాయకులు కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో రక్తదానం చేశారు.