జర జాగ్రత్త.. వేములవాడ ఆలయ పరిసరాల్లో వరుస బైక్‌ చోరీలు

దిశ, వేములవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు కొత్త సమస్య

Update: 2022-03-14 08:30 GMT

దిశ,  వేములవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు కొత్త సమస్య మొదలైంది. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరికి గురవుతున్నాయి. ఆలయ పిఆర్ఓ ఆఫీస్ ముందు ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కి చెందిన బైక్, అలాగే  ఆలయ ముఖద్వారం ముందు బెల్లం వ్యాపారికి చెందిన బైక్ ను.. ఇలా గడిచిన నెల వ్యవధిలో సుమారు పది నుండి పదిహేను వరకు వాహనాలు చోరికి గురయ్యాయి. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ పుటేజ్ ల ఆధారంగా దొంగలకోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఎన్నిసార్లు సూచించినా లాడ్జి నిర్వాహకులు, దుకాణదారులు పెడచెవిన పెడుతున్నారు.ఈ దొంగతనాల నిర్మూలనకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడుతాయి. దీంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు

Tags:    

Similar News