transformer : ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ని తొలగించండి..
కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో గౌడ సంఘ భవనం, మహిళా సంఘ భవనం, స్కూల్ పరిసర ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా రోడ్డుకు ఆనుకొని వున్న ప్రమాదకరమైన హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ని తొలగించాలని, పలుమార్లు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా తొలగించడం లేదని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో గౌడ సంఘ భవనం, మహిళా సంఘ భవనం, స్కూల్ పరిసర ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా రోడ్డుకు ఆనుకొని వున్న ప్రమాదకరమైన హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ని తొలగించాలని, పలుమార్లు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా తొలగించడం లేదని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంఘ భవనం పరిధిలో ఏర్పాటు చేసే పబ్లిక్ మీటింగ్లకు ప్రమాదకరంగా మారిందని ఇప్పటికే ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ కి తాగి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు అని, పశువులు కూడా కొన్ని మరణించాయని అన్నారు. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు త్వరగా ట్రాన్స్ఫార్మర్ ఇక్కడి నుండి తొలగించి మరోచోట అమర్చాలని అధికారులను కోరారు. లేనియెడల మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బుర్ర తిరుపతి, మల్లేశం, సంజీవ్,బుర్ర శ్రీనివాస్, పరుశురాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.