Ramagundam MLA : ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ.

ఆత్మగౌరవానికి ప్రతీక తెగింపునకు నిలువెత్తు నిదర్శనం చాకలి

Update: 2024-09-10 11:50 GMT

దిశ, గోదావరిఖని : ఆత్మగౌరవానికి ప్రతీక తెగింపునకు నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉన్నారు.పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు పెండ్యాల మహేష్.ఆధ్వర్యంలో మంగళవారం నాడు రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్, అడిషనల్ డీసీపీ ఫర్ అడ్మిన్ సి రాజు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. అనంతరం రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఆత్మగౌరవానికి ప్రతీక తెగింపుకు నిలువెత్తు నిదర్శనం రజాకారులను విసునూరు దొరలను ఎదిరించి కొట్లాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఎగురవేసిన ఆడబిడ్డ వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో అణగారిన వర్గంగా ఉన్న రజక జాతి అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్కరు పని చేయాలని తప్పకుండా రామగుండం నియోజకవర్గం లో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించి రజకుల పెద్దన్నగా ముందుంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ అడిషనల్ డీసీపీ సి.రాజు రజక సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ బొంతల రాజేష్ 44వ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మారెల్లి రాజిరెడ్డి మాజీ ఎంపీపీ ఉరి మెట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీటి బాలరాజు కార్పొరేటర్ కలవల శిరీష సంజీవ్ బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పారాపు శ్రీనివాస్ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.


Similar News