Dharmapuri MLA : రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

ధాన్యం తూకం లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని

Update: 2024-10-28 10:31 GMT

దిశ,పెగడపల్లి : ధాన్యం తూకం లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ విప్ (Dharmapuri MLA) ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.మండలం లోని బతికేపల్లి ,రాముల పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలని అదే సమయంలో రైతులకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రైతులు కూడా కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకొని ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.

అంతకు ముందు కీచులాట పల్లి గ్రామం నుండి పత్తిపాక ఎక్స్ రోడ్ వరకు నూతన రోడ్డు నిర్మాణం కోసం సీఆర్ఆర్ గ్రాంట్ కింద రూ.8 కోట్ల 26క్షలు మంజూరు అవ్వగా అందుకోసం అధికారులతో కలిసి రహదారి స్థలాన్ని పరిశీలించారు.సీఆర్ ఆర్ గ్రాంట్ కింద మండలానికి పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, రోడ్ల నిర్మాణం కోసం అదనంగా నిధులు కావాల్సి వస్తే ఆ నిధులను మంజూరు చేస్తానని రోడ్డు పనుల విషయంలో ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని గ్రామీణ ప్రాంతాల రోడ్ల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఐకేపి ఎ పి ఎం సమత,పీఎసీఎస్ డైరెక్టర్ మద్దెల సుధీర్,పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్,మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి, మాజీ ఎంపీటీసీ లు కొత్తపల్లి రవి, ఎలగొండ కృష్ణ హరి,మాజీ సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, రవి నాయక్, నాయకులు కడారీ తిరుపతి,చెట్ల కిషన్,ఆకుల విష్ణు,అనిల్ గౌడ్,దికొండ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News