Manakondur MLA : మానేరు డ్యామ్‌పై బ్రిడ్జి నిర్మాణంతో తగ్గనున్న దూరాభారం

మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం తో గన్నేరువరం మండల ప్రజల

Update: 2024-10-28 11:20 GMT

దిశ,గన్నేరువరం: మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం తో గన్నేరువరం మండల ప్రజల దూర భారం తగ్గనున్నదని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం మండలంలోని చొక్కా రావు పల్లి గ్రామంలో నిర్మాణం కోసం మానేరు నదిని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. మాదాపూర్, గన్నేరువరం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గన్నేరువరం మండలం జిల్లా కేంద్రానికి కంటికి దగ్గర కాలికి దూరంగా ఉన్నదని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుందని ప్రజలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అనేక సందర్భాల్లో కోరడం మూలంగా బ్రిడ్జి ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులతో ఈరోజు స్థల పరిశీలన చేసినట్లు ఆయన తెలిపారు.

చొక్కా రావు పల్లె నుండి ఖాజీపూర్ వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లయితే సుమారు 12 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని మూడు మండలాల ప్రజలకు ఈ బ్రిడ్జి నిర్మానంతో లబ్ధి జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలు నిర్మాణానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అల్లూరు శ్రీనాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిటుకూరి అనంతరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి బొడ్డు సునీల్, మాజీ సర్పంచ్ ముసుకు కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఆల్వాల కోటి , మాజీ జెడ్పిటిసి జువాడి మన్మోహన్ రావు , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాతంగి అనిల్, వడ్నాల నరసయ్య, నల్ల చంద్రారెడ్డి, నాయకులు దుడ్డు మల్లేశం, చింతలపల్లి నరసింహారెడ్డి, చింతల శ్రీధర్ రెడ్డి, పరిపూర్ణ చారి, గొంటి సంతోష్, జంగిడి ప్రకాష్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ రేణుక పాల్గొన్నారు.


Similar News