Rythu Runa Mafi: రుణమాఫీపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

రుణమాఫీ(Rythu Runa Mafi)పై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక ప్రకటన చేశారు.

Update: 2024-10-28 12:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీ(Rythu Runa Mafi)పై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక ప్రకటన చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం సేకరణతో పాటు సన్న రకాలకు బోనస్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.18 వేల కోట్లతో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని అన్నారు.

సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ( Runa Mafi) కాలేదు. అతి త్వరలోనే వారికి కూడా రుణమాఫీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. కాగా, అంతకుముందు అస్వస్థతకు గురై పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముత్తారం మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినుల(KGBV students)ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పరామర్శించారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాలికలు ఒకేసారి అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను విచారిస్తున్నామని, అక్కడ సమీపంలో గల డంప్ యార్డ్‌ను తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News