అటు రాహుల్ పర్యటన.. ఇటుకాంగ్రెస్లో ముసలం..
పెద్దపల్లి నియోజకవర్గం లో రాహుల్ పర్యటన ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి నియోజకవర్గం లో రాహుల్ పర్యటన ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాములు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని బీసీలకు టికెట్లు ఇస్తామని డిక్లరేషన్లు పెట్టి దానిని ఉల్లంఘిస్తూ రెడ్డిలకు రావులకే టికెట్ల విషయంలో పెద్దపీట వేస్తున్నారని బహుజన నాయకులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నందునే పార్టీకి రాజీనామా చేసినట్లు జడ్పిటిసి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అసలు విలువే లేదని పీసీసీ ప్రెసిడెంట్ గా చేసిన పొన్నాల లాంటి వారిని అవమానించి బయటకు వెళ్లేలా చేశారని విమర్శించారు. నా టికెట్ నా చేతిలో లేదు అన్న రేవంత్ రెడ్డి రెండు ఏళ్ల నుంచి విజయ రమణారావును ప్రమోట్ చేస్తూ బీసీలను అనగదొక్కే ప్రయత్నం గతం నుండి చేస్తున్న ఓపికగా ఉన్నామని కానీ టికెట్ల విషయంలో జరిగిన అన్యాయం పై కచ్చితంగా పోరాడేందుకు పార్టీని వీడుతున్నామని తెలిపారు. మేమెంతో మాకు అంత అనే నినాదంతో ముందుకు వెళ్తామని భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా రాములు యాదవ్ తెలిపారు.