రాహుల్ గాంధీ పర్యటనతో బీఆర్ఎస్ నాయకులలో గుబులు: KomatiReddy Narender Reddy

నిన్న జరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కార్నర్ మీటింగ్ కు

Update: 2023-10-20 14:09 GMT

దిశ, కరీంనగర్: నిన్న జరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కార్నర్ మీటింగ్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.దారి పొడుగునా ప్రజలు స్వాగతం పలకడమే కాకుండా బిల్డింగ్ ల పై నుండి పూలు చల్లారని ప్రజలు స్వచ్చందంగా పాదయాత్రలో పాల్గొన్నారని అన్నారు.రాజీవ్ చౌక్ కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ ప్రసంగానికి కార్యకర్తలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా నినాదాలు చేశారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక బిఆర్ఎస్ నాయకులు మంత్రి గంగుల కమలాకర్ తో పాటు అందరి పీటలకు బీటలు వారుతున్నాయని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ పనతీరు పై అన్ని అబద్ధాలు మాట్లాడారని తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్న కర్ణాటక ప్రభుత్వ పని తీరు పై అబద్ధాలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.

చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక వెళ్లి చూసొద్దాం వస్తారా అని చాలెంజ్ విసిరారు. మీ నలభై శాతం కమీషన్ అవినీతి పాలనకు ఆఖరి గడియలు దగ్గర పడ్డాయని మీరేం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేదని నరేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల లాభపడి అధికారం కోల్పోయిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పార్టీ మారిన సునీల్ రావు కాంగ్రెస్ పార్టీని విమర్శించడమేంటనీ ఇప్పుడు మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి పైరవీలు చేసేది ఆయనే అని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఎవరెన్ని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ సంకేతాలు కనిపించడంతో బీఆర్ఎస్ నాయకులు తట్టు కో లేక పోతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ నాయక్,దన్నసింగ్,షబానా మహమ్మద్,ఊరడి లత,జీడి రమేష్,ఎండి చాంద్,మెతుకు కాంతయ్య,మ్యాకల నర్సయ్య,షేక్ శేహెన్ష,దామోదర్,తిరుపతి,అష్రాఫ్,సోహేల్,యోన,బషీర్,ఆంజనేయులు,సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News