పెళ్లాం పుస్తెలమ్మీ డీడీలు తీశాం.. అయినా ఇంకా ఇస్తలేరు

మండల కేంద్రంలోని జిల్లా కేంద్రానికి పోయే ప్రధాన రోడ్డుపై 17 గొల్ల, కుర్మల యాదవ సంఘం సొసైటీ....Protest at Kalwa Srirampur

Update: 2023-01-28 08:14 GMT

దిశ, కాల్వ శ్రీరాంపూర్: మండల కేంద్రంలోని జిల్లా కేంద్రానికి పోయే ప్రధాన రోడ్డుపై 17 గొల్ల, కుర్మల యాదవ సంఘం సొసైటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని యాదవ సంఘం నాయకులు తెలంగాణ ప్రభుత్వం ఒకటో విడత గొర్లు పంపిణీ చేయగా, రెండో విడత విడుదల కోసం ఆరు నెలలుగా క్రితం డీడీలు ప్రతి ఒక్కరూ 4375 రూపాయల చొప్పున డీడీ తీశామని, అయితే తమకు గోర్లు రాలేదని, డబ్బులు అయినా ఇవ్వండి అని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నా చేశారు. యాదవ సంఘం నాయకుల అధ్యక్షులు గాజన వేణ సదయ్య, దేవయ్య మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన కొందరు యాదవ సంఘం సోదరులు బ్రతుకు దెరువు కోసమని పెళ్ళాం పుస్తెలమ్మి, కొందరు అధిక వడ్డీలకు తెచ్చి బ్యాంకులలో డీడీలు తీయడం జరిగిందని, ఆరు నెలల నుండి వడ్డీలు కట్టలేక, ఇంట్లోని సతుల బంగారం అమ్ముకున్నారని.. వారి పోరుతో సమతమవుతున్నామని మండల అధికారులకు గానీ జిల్లా అధికారులకు తమ గోస చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత అధికారులు దగ్గరినుండి సరియైన సమాధానం లేక రోడ్డుపై ధర్నా చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రభుత్వం గొల్ల కురుములపై మొండి వైఖరి వీడి, తక్షణమే గోర్లు లేక డబ్బులు పంపిణీ చేయాలని లేనియేడల జిల్లా కేంద్రాలలో, తెలంగాణ రాష్ట్రంలో తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని యాదవ సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తొట్ల రవి, పందిళ్ళ శ్రీనివాస్, మేకల గోవర్ధన్, మోహన్, నూనెటి వెంకటేష్, జంగం శ్రీనివాస్, నాంసాని పల్లి గోవర్ధన్, నూనెటి వెంకటేష్, జంగం శ్రీనివాస్, నాంసపల్లి గోవర్ధన్, బెతు శ్రీనివాస్, కట్ల నర్సయ్య, శీలం ఓదెలు, తదితర యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News