విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో విశ్రాంతి ఉద్యోగులు సైతం తమ వంతు పాత్ర పోషించారని వారి సమస్యల పరిష్కారం పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.

Update: 2023-04-10 12:43 GMT

వెంటనే ప్రభుత్వం పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలి

దిశ, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ ఉద్యమంలో విశ్రాంతి ఉద్యోగులు సైతం తమ వంతు పాత్ర పోషించారని వారి సమస్యల పరిష్కారం పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపట్టిన విశ్రాంత ఉద్యోగుల శిబిరాన్ని జీవన్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

నగదు రహిత వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని వారికి రావాల్సిన పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తూ మధ్యంతర భృతి కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వారి హక్కుల సాధన కోసం చేసే పోరాటంలో తన మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు. 

Tags:    

Similar News