ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి తీరుతాం: MP Bandi Sanjay Kumar

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు పర్మిషన్ లేదంటూ జగిత్యాల జిల్లా పోలీసులు కోరుట్ల మండలంలోని వెంకటాపూర్‌లో ఆయనను అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు.

Update: 2022-11-27 15:53 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు పర్మిషన్ లేదంటూ జగిత్యాల జిల్లా పోలీసులు కోరుట్ల మండలంలోని వెంకటాపూర్‌లో ఆయనను అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు. అయితే అరెస్టు పట్ల బండి సంజయ్ పోలీసులను తీవ్రంగా తప్పుపట్టారు. జగిత్యాల జిల్లా జ్యూరీడిక్షన్ పరిధిలో తాను ఎలాంటి సమావేశాలు పెట్టడం లేదని అలాంటప్పుడు తనని ఎందుకు అరెస్ట్ చేస్తారని పోలీసులపై పైరయ్యారు. పాదయాత్రకు ముందుగానే అనుమతి ఇచ్చి.. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక హఠాత్తుగా రద్దు చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని సంజయ్ ప్రశ్నించారు.

ఓ వైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిచేసుకుని రూట్ మ్యాప్ ప్రకటించాక.. బైంసా సున్నితమైన ప్రాంతం అంటూ అనుమతి నిరాకరించడం పట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బైంసా ఏమన్నా నిషేధిత ప్రాంతామా.. అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు.. బైంసాని కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ అరెస్టుతో జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్ల మెట్పల్లి ప్రాంతాలలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు రోడ్లపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి: 

బండి సంజయ్ పాదయాత్ర.. నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత

Tags:    

Similar News