భాష్యం విజయసారథి మృతి రాష్ట్రానికి తీరని లోటు: మంత్రి గంగుల కమలాకర్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంస్కృత పండితులు భాష్యం విజయ సారథి మృతిచెందడం పట్ల...Paid tributes to Vijaya Sarathi
దిశ, కరీంనగర్ టౌన్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంస్కృత పండితులు భాష్యం విజయ సారథి మృతిచెందడం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనంతరం విజయ సారథి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మనోధైర్యంతో ఉండాలని అన్నారు. సంస్కృత భాషను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్కృత భాష అభివృద్ధి కోసం విజయసారథి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వివిధ విద్యాసంస్థల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించిన మహాన్నత వ్యక్తి విజయసారథి అని కొనియాడారు. కరీంనగర్ లోని యజ్ఞ వరహాస్వామి ఆలయ ట్రస్టీగా విశేష కృషి జరిపిన గొప్ప వ్యక్తి అని, విజయసారథి మృతి రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. కరీంనగర్ శ్రీపురం కాలనీలో స్వగృహంలో పరమపదించిన విజయసారధి పార్థీవదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాలులర్పించి, వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పరామర్శించారు. నేడు సాయంత్రం నీరుకుళ్ల వాగులో అంతిమ సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. అంతిమయాత్రలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీ.వీ.రమణారావు, జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.