హైకోర్టు న్యాయవాద దంపతులకు ఘన నివాళి

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద హత్య జరిగిన చోటే హైకోర్టు న్యాయవాద దంపతులైన... paid Tributes to High Court lawyer couple

Update: 2023-02-17 10:03 GMT

దిశ, మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద హత్య జరిగిన చోటే హైకోర్టు న్యాయవాద దంపతులైన గట్టు వామన్ రావు- నాగమణి దంపతులకి శుక్రవారం మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నివాళి అర్పించారు. అలాగే మంథనిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాద దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది గొర్రె రమేష్ మరియు సీనియర్ న్యాయవాది రగోతమ్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల దంపతుల హత్య జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తానన్న ప్రభుత్వం మాట తప్పిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు.

హైకోర్టు న్యాయవాదుల దంపతుల హత్య కేసును సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ హత్య విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం న్యాయవాదులకు న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, ప్రధాన కార్యదర్శి చందు పట్ల రమణ కుమార్ రెడ్డి, సీనియర్ న్యాయవాది సయ్యందర్ రెడ్డి, శ్రీకాంత్, న్యాయవాదులు బోట్ల అంజనేయులు, కటకం శ్రీనివాస్, దండే విజయ్ కుమార్, స్రవంతి, అర్ల నాగరాజ్, షబానా, శ్రీహరి, శ్రీనివాస్, శశిభూషణ్ కాచే, రాచర్ల రాజేందర్, అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News