జగిత్యాల కలెక్టరేట్ ఎదుట పద్మశాలీల నిరసన..
వెనుకబడిన తరగతులలోని కులవృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, జగిత్యాల ప్రతినిధి : వెనుకబడిన తరగతులలోని కులవృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో కేవలం బీసీలలోని కొన్ని కులాలను మాత్రమే చేర్చడంతో మిగిలిన వర్గాల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా బీసీలలోని మిగిలిన కులస్తులు ప్రభుత్వ తీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పద్మశాలీల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్ష రూపాయల స్కీంలో పద్మశాలీలను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. దానితో పాటు పద్మశాలిబంధు ప్రకటించి అర్హులైన వారికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలంటూ నినాదాలు చేశారు.