Occult worship : రాయపేటలో క్షుద్ర పూజల కలకలం..

ప్రస్తుతం ఆధునిక సమాజంలో కూడా కొందరు క్షుద్ర పూజలు ( Occult worship ) చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

Update: 2024-10-28 03:29 GMT

దిశ, కాల్వ శ్రీరాంపూర్ : ప్రస్తుతం ఆధునిక సమాజంలో కూడా కొందరు క్షుద్ర పూజలు ( Occult worship ) చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ లో వచ్చే సంఘటనలు చూసి కొందరు ఆకతాయిలు కూడా క్షుద్ర పూజలు అంటూ భయపెడుతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. ఈ క్రమంలోనే మండలంలోని రాయపేట గ్రామంలో క్షుద్ర పూజల ముగ్గులు కలకలం రేపాయి. రాయపేటలోని ఎత్తిపోతల పథకం, ఐకేపీ సెంటర్ పక్కన ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో క్షుద్ర పూజలు జరిపినట్టు అక్కడి రైతులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో రైతులు వడ్ల కొనుగోలు సెంటర్లో ఉన్న వడ్ల పై పర్దాలు కప్పడానికి మోటార్ వాహనాల పై వెళ్లగా, ఆ వాహనాల లైట్ చూసి క్షుద్ర పూజలు చేసే వారు అక్కడి నుండి, వారు తెచ్చుకున్న బైక్ల పై పారిపోయారని తెలిపారు.

ఆ పూజా విధానం చూస్తే క్షుద్ర పూజలు తరహా ఉండడంతో రైతులు భయాందోళన గురయ్యారు. టెక్నాలజీ అందిపుచ్చుకున్న కాలంలో, ప్రపంచం దూసుకుపోతున్నా, మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దెయ్యాలు, భూతాలు అంటూ కొందరు అంధ విశ్వాసం ఉనికి తేలుతున్నారు. నిత్యం ప్రతి ఆదివారం వచ్చిందంటే ఏదో ఒకచోట మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతూనే ఉన్నాయి. నిమ్మకాయలు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు, తల లేని కోడి, ఎర్రటి కుంకుమతో ముగ్గులు వేసి చూస్తేనే బయట భయపడేటట్లు క్షుద్ర పూజలు చేస్తున్నారు. మూఢనమ్మకాల పై అవగాహన కల్పించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News