MLA:చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం
రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam)అన్నారు.
దిశ, గంగాధర : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam)అన్నారు. గంగాధర మండలం ఉప్పర మల్యాల, రంగారావు పల్లి గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే (Purchase Centers)రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.