మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన MLA Rasamai .. ఇప్పుడు ఏకంగా....
కరెంట్ ను అంబానీ, అదానికి ఆమ్మేవాళ్లు కావాలా..? రైతులను కంటికి రెప్పలా కాపాడుకునే...MLA Rasamai Comments
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: కరెంట్ ను అంబానీ, అదానికి ఆమ్మేవాళ్లు కావాలా..? రైతులను కంటికి రెప్పలా కాపాడుకునే కేసీఆర్ కావాలా రాజన్నసిరిసిల్ల రైతులు ఆలోచించుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉందని, రైతు కి బీఆర్ఎస్ కి చాలా సంబంధాలు ఉన్నాయన్నారు. ఆనాడూ కరెంట్ లేక రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కరెంట్ కోతలకు వ్యతిరేకంగా పుట్టింది గులాబీ జెండా అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఆనాడు కరెంట్ కోసం రైతు ఉద్యమాలు జరిగాయన్నారు. మూడు కాలలతోపాటు తెలంగాణలో నీళ్ళు అనే నాలుగవ కాలం సృష్టించింది సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
రైతులను కాపాడుకునే రాష్ట్రం తెలంగాణ అని రసమయి పేర్కొన్నారు. మోటార్ ల వద్ద మీటర్లు పెట్టేందుకు నరేంద్ర మోడీ చేస్తున్నారని తెలిపారు. కరెంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు రైతు భీమా ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణలో మిగిలింది సిరిసిల్ల సెస్ ఒక్కటే అని అన్నారు. కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తున్నదో తెలియదు.. బీజేపీ వాళ్ళను నమ్మవద్దని, బీజేపీ పార్టీ వాళ్ళు కరెంట్ దొంగలని.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అంత రైతులేనని ఎమ్మెల్యే బాలకిషన్ పేర్కొన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ మాట్లాడుతూ సరిగ్గా 8 ఏళ్ల క్రితం కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల గోస, చేనేత కార్మికులు బాధలు తొలిగి పోయాయన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు అగిపోయాయన్నారు. ఒకప్పుడు ఎడారి ప్రాంతం కానీ నేడు మిడ్ మానేరు కావచ్చు, జిల్లాలోని అన్ని చెరువులు నిండిపోయాయి.. రైతులు పంటలు పండిస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో 15 డైరెక్టర్ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల సెస్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు జిందం చక్రపాణి, సిద్దం వేణు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
Also Read...