MLA Chintakunta : ధాన్యం కటింగ్ పెడితే బ్లాక్ లిస్ట్ లోకే
వడ్లు కటింగ్ పెడితే బ్లాక్ లిస్ట్ లోకి వెళతారని రైస్ మిల్లర్లను పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హెచ్చరించారు.
దిశ, సుల్తానాబాద్ : వడ్లు కటింగ్ పెడితే బ్లాక్ లిస్ట్ లోకి వెళతారని రైస్ మిల్లర్లను పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హెచ్చరించారు.సుల్తానాబాద్ మండలం నరసయ్యపల్లి, బొంతకుంటపల్లి, గర్రెపల్లి, భూపతిపూర్, ఐతరాజ్ పల్లి, దుబ్బపల్లి గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీల ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్లను శనివారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. సన్నవడ్లు వేసుకోమని చెప్పి రైతులను దివాలా తీయించింది బీఆర్ఎస్ కాదా అని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు.
అలాగే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.5 వందల చొప్పున బోనస్ చెల్లించినట్టు చెప్పారు. రైతులకు పరిమితి లేకుండా బోనస్ ఇవ్వనున్నట్టు తెలిపారు. నాణ్యమైన నిర్ణీత తేమతో కూడిన వడ్లను తీసుకువచ్చే బాధ్యత రైతులదని అన్నారు. సెంటర్లలో వడ్లను కాంటా వేసిన అనంతరం రైతులు రసీదులు పొందాలన్నారు. సెంటర్ల ఇన్చార్జిలు ఎలాంటి తేడాలు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. రైతులకు మోసం జరిగితే సహించేది చేసేది లేదని స్పష్టం చేశారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వడ్ల కటింగ్ల పేరిట రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం వడ్ల కటింగ్ లకు స్థానం లేకుండా చేశామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తమకు ఉన్నంతకాలం ఇదే పద్ధతిని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్, మార్కెట్ డైరెక్టర్లు, మండల అధ్యక్షులు చిలుక సతీష్, జానీ, తీర్మల్ రావు, రాజేశ్వర్ రావు, సందీప్ రావు, ప్రజాప్రతినిధులు,మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.