తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుంది మంత్రి కొప్పుల ఈశ్వర్

సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధమైన పరిపాలనతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

Update: 2023-03-13 14:22 GMT

దిశ, వెల్గటూర్: సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధమైన పరిపాలనతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూరు మండల పరిధిలోని కొత్తపేట గొడిసెల పేట గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తెలంగాణలో చేయలేని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపెడుతున్నారని వెల్లడించారు. మన ఊరు.. మన బడిలో భాగంగా నాణ్యమైన విద్యనందించడానికి కృషి చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్య మైందన్నారు.

సీఎం కేసీఆర్ వినూత్న మైన ఆలోచనలతో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసి బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం వెల్గటూర్ మండలంలో నిర్వహించిన ఎంఎల్ఏ రోలింగ్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వెనుగుమట్ల జట్టుకు మొదటి బహుమతి, వెల్గటూర్ జట్టుకు ద్వితీయ బహుమతిని అందజేశారు. అనంతరం స్థంబంపల్లి లోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల మొదటి వార్షికోత్సవం కార్యక్రమంలో హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకొని మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీ.ఎస్ లత, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, మండల విద్యాధికారి భూమయ్య, జడ్పీటీసీ బి.సుధారాణి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, సర్పంచ్ కొమ్ము రాంబాబు, ప్రిన్సిపల్ జక్కని రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News