జిల్లా సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయండి: కుమారస్వామి

Update: 2022-03-04 16:51 GMT

దిశ, సైదాపూర్: కరీంనగర్ జిల్లా మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల సర్వసభ్య సమావేశంను విజయవంతం చేయాలనిమహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు కుమారస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని వాసర గార్డెన్‌లో శనివారం ఉదయం 11గంటలకు జిల్లా మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల సర్వసభ్య సమావేశం జిల్లా సంఘం అధ్యక్షతన నిర్వహించబడుతుందని తెలిపారు. కావున జిల్లాలోని మత్య్స పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, తప్పకుండా హాజరై సర్వసభ్య సమావేశంను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా కార్యదర్శి నెల్లి సంపత్, మండల అధ్యక్షులు పోలు ప్రవీణ్, యువత అధ్యక్షులు నీర్ల సతీష్, మండల ప్రధానకార్యదర్శి గూళ్ల అశోక్, మండల ఉపాధ్యక్షులు నీర్ల వెంకట్రాజం, నాయకులు గాలిబు రమేష్, నెల్లి శ్రీనివాస్, దండవేణి సారయ్య, లంకసిరి మైసయ్య, విజయ్, గూళ్ల రమేష్, రెడ్డి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News