SP Ashok Kumar : జిల్లా లో 30 మంది బాల కార్మికులకు విముక్తి

అన్ని శాఖల సమన్వయంతోనే ఆపరేషన్ ముస్కాన్-10 విజయవంతం అయిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.

Update: 2024-08-01 15:49 GMT

దిశ, జగిత్యాల టౌన్ : అన్ని శాఖల సమన్వయంతోనే ఆపరేషన్ ముస్కాన్-10 విజయవంతం అయిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా బాలలను గుర్తించి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చినట్లు తెలిపారు. ఈ ఏడాది జూలై 1 నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని, ఇందులో 30 మంది బాలకార్మికులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ

    ముందు హాజరుపరిచినట్టు తెలిపారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నా, ఎక్కడైనా పనిచేసినా, తప్పిపోయినా, వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసినా వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags:    

Similar News