Korukanti Chander. తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం బాధాకరం

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష

Update: 2024-07-23 13:24 GMT

దిశ,గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత ప్రదర్శిస్తోందని మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ ప్రాంతానికి మొండిచేయి చూపడం బాధాకరమని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కొన్ని రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించడంలో పెద్దపీట వేశారని, తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించిన బడ్జెట్ శూన్యమని అన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి 8 మంది కాంగ్రెస్ 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులున్నారని, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఎలాంటి వారు బడ్జెట్ కేటాయింపులపై నోరుమెదపోవడం బాధకరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి కి 15 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి తెలంగాణ కు ఒక్క ప్రాజెక్టు గాని నిధులు కాని కేటాయించకపోవడం అన్యాయమని తెలిపారు. మన ప్రాంతం హక్కులు మన హక్కులు సాధించాలంటే కేసీఆర్‌ లాంటి బలమైన నాయకత్వానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలన్నారు.

Tags:    

Similar News