కోనరావుపేట వస్త్రపరిశ్రమకు కర్మాగారంగా మారాలి.. ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు

మహిళా సామాజిక సాధికారత ఇంటి నుంచి ప్రారంభం కావాలని, అందుకే ప్రతి మా ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు, ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ డాక్టర్ వికాస్ రావు దీప దంపతులు తెలిపారు.

Update: 2023-06-14 14:50 GMT

దిశ, కోనరావుపేట : మహిళా సామాజిక సాధికారత ఇంటి నుంచి ప్రారంభం కావాలని, అందుకే ప్రతి మా ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు, ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ డాక్టర్ వికాస్ రావు దీప దంపతులు తెలిపారు. బుధవారం ప్రతిమ ఫౌండేషన్, ఇతర కార్పొరేట్ సంస్థల సహకారంతో మహిళలకు అందజేస్తున్న ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ రావు, దీప దంపతులు మాట్లాడుతూ కోనరావుపేట తమ జన్మభూమి, కర్మభూమి అని కొనియాడారు. స్వస్థలంలో 300 కుట్టు మిషన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. దవాఖాన మీ దర్వాజ దగ్గర అనే నినాదంతో ఉచితంగా వైద్య సేవలు అందించామని, ప్రతిమ ఫౌండేషన్ ద్వారా శుద్ధ జల కేంద్రాలు, అంబులెన్సులు, మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామనన్నారు.

పురుషులకు సమానంగా మహిళలు ఎదుగుతున్నారని, అవని నుంచి ఆకాశం వరకు మహిళలు పరుగులు తీస్తున్నారన్నారు. గ్రామాల్లో మాత్రం మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, చేయూత నివ్వడానికే కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఉచిత శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తుంది. మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు జనాభాలో సగం మహిళలు ఉన్నారని, అమ్మ కడుపులో ఆడపిల్లలను చంపే సంస్కృతి ఇంకా మారలేదన్నారు. ఆడపిల్ల అంటే భారం కాదు... బంగారం అని భావించాలన్నారు. మహిళా సామాజిక సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలని, వంటింటికే పరిమితం కాకుండా వ్యాపారంలోకి రావాలన్నారు.

మహిళలు సంగటితమైతే ఎన్నో రంగాల్లో ముందుకు రావచ్చని, వస్త్రపరిశ్రమకు కొనరావుపేట కర్మగారంగా మారాలన్నారు. ప్రభుత్వం, ప్రజలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో గ్రామాలు అభివృద్ధి చెందాలని, మాజీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్ రావు నిధులతోపాటు, కార్పొరేట్ సంస్థలతో సహకారంతో నిమ్మపెల్లి చెరువు నుండి మండల కేంద్రానికి నీరు తెచ్చారన్నారు. అసమానతలు పోవాలంటే పరిశ్రమలు రావాలని,ప్రతిమ ఫౌండేషన్ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు. నైపుణ్యం లేక యువతకు ఉద్యోగాలు రావడం లేదని, ప్రతి మండలానికి ఉచిత నైపుణ్య కేంద్రాలు రావాలన్నారు. రైతు రాజు కావాలంటే, సకాలంలో రుణాలు, మద్దతు ధర ఇవ్వాలని, రుణ భారం పెను భారంగా మారి రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.

రైతులకు సకాలంలో రుణాలు, మద్దతు ధర, ఎరువులు, ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులందరూ సంగటితమైటే వ్యవసాయంలో ఎన్నో మార్పులు వస్తాయన్నారు. అవినీతి జన్మహక్కులా కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్నారని, మత్తుకు యువత భానిసలై భవిష్యత్తును నాశనం చేసుకుంటుననారని అన్నారు. సబ్ కా సాత్ సాబ్ కా వికాస్ అన్నా విధంగా అందరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ ఎంపీటీసిలు ప్రవీణ్, రేణుక, బీజేపీ జిల్లా నాకులు సురేందర్ రావు, మండల అధ్యక్షుడు గొట్టే రామచంద్రం, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ, సింగిల్ విండో డైరెక్టర్ జ్యోతి, ఆయా గ్రామాల సర్పంచులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Tags:    

Similar News