తెలంగాణకు సీఎం కేసీఆరే... శ్రీరామరక్ష : ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

ఎన్నో త్యాగాలతో సాధించిన తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు.

Update: 2023-04-25 15:44 GMT

దిశ, బెల్లంపల్లి : ఎన్నో త్యాగాలతో సాధించిన తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. బెల్లంపల్లిలో మంగళవారం టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా ఇన్ చార్జి లక్ష్మణరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మరోసారి బెల్లంపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురుతుందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, కుల, మతాల మధ్య చిచ్చుపెడుతోందన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బు సంచులతో దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడేదేలేదని, బీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని ధీమా వ్యక్తం చేశారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే బీఆర్ఎస్ విజయానికి ముఖ్య భూమికి పోషిస్తాయన్నారు. వ్యవసాయ, వైద్య, విద్య అన్ని రంగాల్లో రాష్ట్రం మరెన్నోడు అభివృద్ధి చెందనంత ముందుకెళ్లిందన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోవడం లేదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఏఎంసీ చైర్మన్ నిరంజన్ గుప్తా పాల్గొన్నారు.

Tags:    

Similar News