కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి: శోభరాణి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని... Kanti Velugu at pegadapalli
దిశ, పెగడపల్లి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ తాటిపర్తి శోభరాణి సూచించారు. మండలంలోని బతికేపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేయడమే కాకుండా అవసరం అయినవారికి కంటి అద్దాలు కూడా అందజేస్తుంది అని, 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం సర్పంచ్ కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ 1 చింతకింది అనసూర్య, వైద్యులు రాకేష్, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, ఎం ఎల్ హెచ్ పీ సంధ్య, ఏఎన్ ఎంలు సంధ్య, చిలకమ్మ, లక్ష్మి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.