పీడించే ముఖ్యమంత్రిని గద్దె దింపాలి : వివేక్‌‌ వెంకటస్వామి

అనేక హామీలు ఇచ్చి మోసం చేస్తూ పీడిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ను, బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ప్రజలంతా కలిసి గద్దె దింపాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌‌ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

Update: 2023-02-22 14:48 GMT

దిశ, గోదావరిఖని : అనేక హామీలు ఇచ్చి మోసం చేస్తూ పీడిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ను, బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ప్రజలంతా కలిసి గద్దె దింపాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌‌ వెంకటస్వామి పిలుపునిచ్చారు. 'ప్రజా గోస‒బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా బుధవారం గోదావరిఖని మార్కండేయ కాలనీలో కార్పొరేటర్‌‌ దుబాసి లలిత మల్లేశ్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్‌‌ మీటింగ్‌‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం ప్రజలెవరినీ కలవరని, వందల ఎకరాల్లో విస్తరించిన ఫామ్‌‌ హౌస్‌‌కే పరిమితమయ్యారని, ఒకవేళ దగ్గరకు వెళ్లి ఏదైనా సమస్య గురించి చెప్పుకుందామన్నా, పోలీసుల ద్వారా అరెస్ట్‌‌లు చేయిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రూ.ఐదు వేలు ఇచ్చి ఓటును కొని మళ్లీ గెలుస్తాననే ధీమాతో కేసీఆర్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఉందని, ఇలాంటి సీఎంను మళ్లీ గెలిపిస్తే ఐదేండ్లు గోస పడతామని, ప్రజలు ఆలోచించాలని కోరారు.

    ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మద్యం, ఆర్టీసీ ఛార్జీల పెంపు, పెట్రోల్‌‌, డీజీల్‌‌ ధరల పెంపు, డబుల్‌‌ బెడ్‌‌ రూమ్‌‌ ఇళ్లు, మూడు ఎకరాల భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌‌, తదితర అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. అలాంటి బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ గుర్తు అయిన కారు టైరుకు వచ్చే ఎన్నికల్లో ఫంక్చర్‌‌ చేసి మాట తప్పిన కేసీఆర్‌‌ను గద్దె దింపాలని కోరారు. దేశంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా, ప్రపంచంలోనే పవర్‌‌పుల్‌‌ ప్రధానిగా పేరు తెచ్చుకున్న నరేంద్ర మోడీ పాలన రాష్ట్రంలో కూడా కొనసాగడానికి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీని గెలిపించాలన్నారు. ఇదిలా ఉండగా ప్రజల సమస్యలను, వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడం, నరేంద్ర మోడీ పాలన గురించి ప్రజలకు వివరించడానికి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా 11 వేలకు పైగా కార్నర్‌‌ మీటింగ్‌‌లను నిర్వహిస్తుందన్నారు.

    అయితే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఉన్న కొందరు బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల బీజేపీ కార్నర్‌‌ మీటింగ్‌‌లను పోలీసులను అడ్డుపెట్టుకుని తమ అనుచరుల ద్వారా అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తాము చేసిన పాపాలకు, అవినీతి చర్యలకు తప్పక జైలుకు పోతామనే ఉద్దేశంతోనే బీజేపీ కార్నర్‌‌ మీటింగ్‌‌లను అడ్డుకుంటున్నారని తెలిపారు. అలాగే తాను ఇటీవల అహ్మదాబాద్‌‌లో ఉంటే సీఎం కేసీఆర్‌‌ను ఫామ్‌‌హౌస్‌‌లో కలిశానని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని, ఇదంతా ఫేక్‌‌ న్యూస్‌‌ అని ఆయన కొట్టిపారేశారు. ఇక సింగరేణి ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని, ప్రధాని మోడీపై కేసీఆర్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలోని రైతాంగానికి ఎరువులు అందించేందుకు రామగుండం ఎరువుల కర్మాగారం తో పాటు మరో ఐదు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమములో పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ రాంనాథ్, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్, రామగుండం ఫ్రబారి ఆరుముల్ల పోచం, సోమారపు లావణ్య, బల్మూరి అమరేందర్ రావు, రాచకొండ కోటేశ్వర్లు, మహావాది రామన్న, గోవర్ధన్ రెడ్డి, కామ విజయ్,సునీల్ కుమార్‌‌, తిప్పారపు మధు, తదితరులు పాల్గోన్నారు. 

Tags:    

Similar News