పేపరు లీకేజీపై ప్రభుత్వం బాధ్యత వహించాలి: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రాల పేపర్ లీకేజీ పై హైకోర్టు సివిల్ జడ్జితో విచారణ జరిపించి, అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
దిశ, మంథని: టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రాల పేపర్ లీకేజీ పై హైకోర్టు సివిల్ జడ్జితో విచారణ జరిపించి, అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం మంథనిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీకి ప్రభుత్వం పూర్తి భాధ్యత వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాలు లీకేజీ పై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా అనే అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో పేపర్ లీకేజీల విషయంలో ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించడంతో మళ్లీ ఇదే తతంగం జరిగిందని అన్నారు. ఉద్యోగాల కోసం వేలు వెచ్చించి కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులకు భవిష్యత్తు బాధాకరమన్నారు. ఈ పరీక్షలు సమగ్రంగా నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శశిభూషణ్ కాచే, చొప్పరి సదానందం, తోట్ల తిరుపతి యాదవ్, సెగ్గం రాజేష్, ఇనుముల సతీష్, అజీమ్ ఖాన్, పర్వతాలు, తదితరులు పాల్గొన్నారు