కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మేలు

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

Update: 2024-10-25 11:14 GMT

దిశ, మల్లాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని కేవీఆర్ ఫంక్షన్ హాల్ లో కొత్త మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జ్ జువ్వాడి నర్సింగరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వీరి సమక్షంలో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

    చైర్మన్ గా అనతడుపుల పుష్పలత నర్సయ్య, వైస్ చైర్మన్ గా ఇట్టేడి నారాయణరెడ్డి, డైరెక్టర్లుగా బద్దం రాధా సుధాకర్ రెడ్డి, నూతిపెళ్లి రాజం, కొత్తపెళ్లి రాజారెడ్డి, గురిజాల గంగారెడ్డి, నల్ల శ్రీనివాస్, భూక్య వాసురాం, బొల్లం ఆకాంక్ష రఘు, మహమ్మద్ జమాలుద్దీన్, చౌడారపు శ్రీనివాస్, నాయిని రాజేందర్, నిమ్మల బూమ్ రెడ్డి, చిలివేలి రాములు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రుణమాఫీ చేయలేదని, రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.

     కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని, మిగతా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎలాల జలపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News