మత్స్యకారుల సంక్షేమానికి సర్కార్ కృషి

మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

Update: 2024-10-25 11:47 GMT

దిశ, మానకొండూరు : మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలోని చెరువులో శుక్రవారం ఆయన చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. తొలి విడతలో కరీంనగర్ జిల్లాతోపాటు హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా, రెండో విడతలో మిగితా జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

     ఇందులో భాగంగానే అన్నారం చెరువులో చేప పిల్లలను వదిలినట్టు చెప్పారు. ఈ కార్యక్రమాలలో మత్య్సశాఖ ఏడీ విద్యాభారతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, మానకొండూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, గంగుల మహేందర్, మీస సత్యనారాయణ, మాడ తిరుపతిరెడ్డి, సాయిరి దేవయ్య, ఆర్. శ్రీనివాస్, సహదేవ్, ప్రేమ్ కుమార్, కోండ్ర సురేష్, రామాంజనేయులు, శ్రీధర్, సతీష్, కిషన్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News