KTR : రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సేవలందించిన కేటీఆర్

ఎవరికైనా రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కడ తమ మీదికి వస్తుందనో, లేదా తమకెందుకులే అని తప్పుకు పోతుంటారు చాలామంది.

Update: 2024-10-25 11:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎవరికైనా రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కడ తమ మీదికి వస్తుందనో, లేదా తమకెందుకులే అని తప్పుకు పోతుంటారు చాలామంది. కాని ఒక పార్టీకి అగ్రనేత, మాజీ మంత్రి అయిఉండి కూడా రోడ్డు ప్రమాద బాధితులకు సేవలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఓ బైక్, వ్యాన్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు రోడ్డు పక్కన పడి ఉండటం.. అటుగా సిరిసిల్ల నుండి హైదరాబాద్ వెళ్తున్న కేటీఆర్ చూసి, తన కాన్వాయ్ దిగి వారికి సపర్యలు చేశారు. అంబులెన్స్ ను పిలిపించి, వారిని అంబులెన్స్ లో ఎక్కించే వరకు ఉండి మరీ ప్రమాద బాధితులకు దైర్యం చెప్పారు. కాగా కేటీఆర్ ఉదారతపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News