ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

Update: 2024-09-11 15:28 GMT

దిశ, వేములవాడ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం రాత్రి వేములవాడ పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించిన ఆయన నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గణేష్ మండపాలను జియో ట్యాగ్ చేయటం జరిగిందన్నారు.

    జిల్లాలో అన్ని పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోట్ వాహనాలతో రాత్రి, పగలు గణేష్ మండపాలతో పాటు అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. నవరాత్రుల సందర్బంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి మండపం వద్ద విధిగా సీసీ కెమెరాలు అమర్చుకునే విధంగా మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించామని అన్నారు. పోలీసుల సలహాలు,సూచనలు పాటిస్తూ నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని, గణేష్ మండపాల వద్ద, శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో డీజే లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సీఐ వీరప్రసాద్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News