ఎనమిది నెలల గర్భిణికి ఫిట్స్.. మానవత్వం చాటుకున్న ఓరుగంటి

శంకరపట్నం మండల పరిధిలో రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ పర్యటనకు వెళ్తున్నారు.

Update: 2023-03-25 14:45 GMT

దిశ, మానకొండూర్: శంకరపట్నం మండల పరిధిలో రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మానుకొండూరు మండలం ఈదుల గట్టుపల్లి విద్యుత్ ఉపకేంద్రం ఎదుట సిరిసిల్ల వాసులు వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్నారు. దీంతో బైక్ పై ఉన్న ఎనమిది నెలల గర్భవతి ఎండ వేడిమికి తాళలేక ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి పడిపోయింది. అటుగా వెళ్తున్న రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ గమనించి కారును పక్కకు ఆపి వారి వద్దకు వెళ్లారు. అక్కడే గర్భిణి కి ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం అంబులెన్స్  వాహనాన్ని సమకూర్చి సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో అక్కడున్న గ్రామస్థులు, స్థానికులు, వాహనదారులు ఆనంద్ ను అభినందించారు.

Tags:    

Similar News