పార్టీ కోసం కష్టపడ్డా ఫలితం లేకపోయే : ముదుగంటి రవీందర్ రెడ్డి

పార్టీ కోసం కష్ట పడ్డా కూడా జగిత్యాల నియోజకవర్గం బీజేపీ అసెంబ్లీ ఎన్నికల

Update: 2023-10-25 15:38 GMT

దిశ,జగిత్యాల టౌన్: పార్టీ కోసం కష్ట పడ్డా కూడా జగిత్యాల నియోజకవర్గం బీజేపీ అసెంబ్లీ ఎన్నికల టికెట్ భోగ శ్రావణి ఇవ్వడం సబబుగా లేదని వాపోయారు.మరొక పార్టీ అభ్యర్థికి లాభం చేకురాటానికి భోగ శ్రావణికి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు సిద్ధాంతాల కోసం ప్రాణ త్యాగాలు చేశారని, టికెట్ విషయంలో తనను కాదని, తనను సంప్రదించకుండానే భోగ శ్రావణి కి టికెట్ ఇవ్వడం ఆయన తప్పు పట్టారు.

జగిత్యాలలో కష్టపడి నిర్మాణం చేసుకున్న పార్టీని భూస్థాపితం చేసి కుట్ర పన్నుదాం అనుకుంటే తానేమి చేతకాని వాడిని కానని, తాను పార్టీకి నిర్ణయానికి వ్యతిరేకం కాదని పార్టీ నిర్ణయాన్ని దెబ్బతీస్తే ఎంతకైనా తీస్తామన్నారు. ఇప్పటికైనా అధిష్టానం మరల చర్చించి తర్వాత అభ్యర్థికి బి ఫామ్ ఇవ్వాలని అన్నారు. మోసపూరిత కుట్రను త్వరలోనే బహిర్గతం చేస్తామన్నారు. కార్యకర్తలు ఆదేశిస్తే తను స్వతంత్రంగా నైనా పోటీ చేస్తానన్నారు. పార్టీని మాత్రం వీడనని వాటిలో ఉండి పోరాడుతానన్నారు.ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కౌన్సిలర్ గుర్రం రాము, లింగంపేట శ్రీనివాస్, సిపెల్లి రవీందర్ మొదలగు నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News