మండల పరిషత్ సమావేశంలో రసాభాస..
జగిత్యాల రూరల్ మండల సర్వసభ్య సమావేశం ఇన్ చార్జి ఎంపీపీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు.
బిల్లులు రాలేదంటూ.. పెట్రోల్ డబ్బాలతో సర్పంచ్ ల నిరసన
దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండల సర్వసభ్య సమావేశం ఇన్ చార్జి ఎంపీపీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి కొందరు సర్పంచ్ లు పెట్రోల్ డబ్బలతో రావడంతో సమావేశం రసాభాసగా మారింది. నాలుగేళ్లుగా చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, కనీసం పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వాపోయారు. ఒక్కో సర్పంచ్ కు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు బిల్లులు రావాలన్నారు. దీంతో తాము అప్పులపాలు అయ్యామాని పెండింగ్ లో ఉన్న బిల్లులను అధికారులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో మీడియాపై ఇన్ చార్జి ఎంపీపీ రాజేంద్రప్రసాద్ దురుసుగా ప్రవర్తించారు. సర్పంచ్ లు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలపగా.. వాటిని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై ఇన్ చార్జి ఎంపీపీ మీడియా కవరేజ్ మాకు అక్కర్లేదంటూ.. బయటకెళ్లండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మీడియా మిత్రులు ఎంపీపీ వైఖరికి గాను నిరసనకు దిగారు. దీంతో దిగొచ్చిన ఎంపీపీ మీడియా మిత్రులు, సర్పంచ్ లకు క్షమాపణ చెప్పారు.