ఆన్ లైన్ ద్వారా మొక్కులు.. కోటిలింగాల టెంపుల్ లో డిజిటల్ పేమెంట్స్
దిశ, జగిత్యాల టౌన్: మనుషులతో మాట్లాడే రోజులు పోయాయి. ఇదో డిజిటల్ యుగం. అంతా ఆన్ లైన్‌లోనే మాట్లాడేది.
దిశ, జగిత్యాల టౌన్: మనుషులతో మాట్లాడే రోజులు పోయాయి. ఇదో డిజిటల్ యుగం. అంతా ఆన్ లైన్‌లోనే మాట్లాడేది. జనజీవనంలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అంతా ఫోన్లతోనే గంటల కొద్ది గడిపేస్తున్నారు. క్షణం స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూడకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఆఫ్‌లైన్ అనుబంధాలు అక్కర్లేదు. అన్నీ ఆన్ లైన్ బంధాలే అన్నట్లుగా మారింది సమాజం. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం లోని కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో అందరూ గుడికి వస్తే మొక్కులు చెల్లించుకొని హుండీలో కానుకలు వేస్తారు. కానీ భక్తులు ఈ ఫోన్ పే ద్వారానే దేవుడికి కట్నం, కానుకలు వేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రతి ఆలయంలో రాష్ట్రం అంతటా నగదు రహిత సేవలు ప్రారంభించింది.ఇక నుంచి జేబులో పైసల్ మర్చిపోతే, ఫోన్ తీసి స్కాన్ చేసి మొక్కులు చెల్లించుకోవచ్చు.