రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించాలి : MP Sanjay Kumar

రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించాలని ఎంపీ బండి సంజయ్ అన్నారు.

Update: 2023-08-27 12:35 GMT

దిశ, మానకొండూరు : రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించాలని ఎంపీ బండి సంజయ్ అన్నారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే ప్రవాస్ యోజన ముగింపు కార్యక్రమంలో భాగంగా బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి అలుగునూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 'ప్రధానమంత్రి మన్ కీ బాత్' కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలిసి వీక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, అస్సాం రాష్ట్ర ఎమ్మెల్యే దిగంత కలిత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. అవినీతి పాలన చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ అంతమొందించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో దళితులకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. దళితులను రాష్ట్రపతి చేసిన ఘనత కేవలం బీజేపీ పార్టీకే దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈనుకొండ నాగేశ్వర్ రెడ్డి, పుల్లేల పవన్ కుమార్, దరువు ఎల్లన్న, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, మాడ వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమురయ్య, మానకొండూరు నియోజకవర్గ నాయకులు గడ్డం నాగరాజు, సొల్లు అజయ్ వర్మ మండలాధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News