రాష్ట్రంలో కాంగ్రెస్ రనౌట్.. బీజేపీ డకౌట్ : హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రనౌట్
దిశ, కోరుట్ల టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రనౌట్...బీజేపీ డకౌట్ అవ్వడం ఖాయమని, కేసీఆర్ సిక్స్ కొట్టడం ఖాయమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జోష్యం చెప్పారు. శుక్రవారం కోరుట్ల పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అయన ప్రసంగించారు.గడిచిన పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రము అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. నాడు కాంగ్రెస్ పరిపాలనలో రైతుల కష్టాలు వర్ణనాతీతం అన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో రైతులకు నేడు వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు రైతులకు ఎరువులు కూడా దొరికేది కాదని విమర్శించారు. పదేండ్ల కింద టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ...పదేండ్ల పాలనా గురించి చర్చలు పెట్టుకుందామనడం సిగ్గుచేటన్నారు.
ఆనాడు పావురాల గుట్టలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణిస్తే ....పావురాల గుట్టలో పావురం ల ఎగిరిపోయాడని ఎద్దేవా చేసిన రేవంత్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదని గుర్తుచేశాడు. ఇప్పటి వరకు 12070 మంది ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి పథకం అందించామన్నారు. రైతు బంధు ద్వారా ఇప్పటి వరకు 11 కిస్తులు చెల్లించామన్నారు. ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల సంజయ్ లు మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల గ అప్గ్రేడ్ చేయడం కోసం, డయాలసిస్ సెంటర్ మంజూరు కోసం హరీష్ రావు చేసిన కృషి మరువాల్డనిదన్నారు. మీడియా పట్ల ఎసిబి డీఎస్బి రవీంద్ర కుమార్ దురుసుగా వ్యవహరించి ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమానికి పాత్రికేయులను అనుమతించలేదు. దీంతో పాత్రికేయులు అసహనం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మెట్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ లు రానవేని సుజాత సత్యనారాయణ, అన్నం లావణ్య అనిల్, జెడ్పిటిసి దరిశెట్టి లావణ్య రాజేష్, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షుడు దరిశెట్టి రాజేష్, అన్నం అనిల్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.